Saturday, September 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజనజీవనానికి ఆటంకాలుండొద్దు

జనజీవనానికి ఆటంకాలుండొద్దు

- Advertisement -

లోతట్టు, వరద ముప్పు ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోండి
కలెక్టర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

భారీ వర్షాల నేపథ్యంలో జనజీవనానికి ఆటంకం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం ఆయన పలు జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ ఉన్నతాధికారులతో మాట్లాడి వారికి దిశానిర్దేశం చేశారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలన్నారు. విపత్తుల నిర్వహణా శాఖ ఆయా జిల్లాల్లో ఇరిగేషన్‌, విద్యుత్‌, పంచాయతీరాజ్‌, రహదారులు, పోలీస్‌ విభాగాలతో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్ధితి గురించి సంబంధిత అధిరారులతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేశారు ప్రతి జిల్లా కేంద్రంలో కంట్రోల్‌ రూమ్‌లు నిరంతరం పనిచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రధాన పట్టణాల్లోని రహదారులపై ఉన్న నాలాల మూతలు ఎట్టి పరిస్థితుల్లో తొలగించవద్దని సూచించారు. వర్షం పడే సమయంలో విద్యుత్‌ స్తంభాల సమీపంలో ఉండకూడదని కోరారు. క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామనీ, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న హన్మకొండ, వరంగల్‌ , జనగాం, మహబూబాబాద్‌, భూపాలపల్లి తదితర జిల్లాలపై ఎక్కువ దృష్టి సారించాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -