Tuesday, January 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలేరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కౌన్సిలర్లుగా బరిలో నిలిచేది వీరే

ఆలేరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కౌన్సిలర్లుగా బరిలో నిలిచేది వీరే

- Advertisement -

నవతెలంగాణ- ఆలేరు
ఆలేరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లుగా పోటీ చేసే ఆ పార్టీ నాయకుల జాబితాను మంగళవారం పట్టణ అధ్యక్షుడు ఎం ఏ ఎజాజ్ నవతెలంగాణకు తెలిపారు. ఎలాగైనా ఈసారి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య సర్వే నిర్వహించి గెలుపొందే అభ్యర్థులను గుర్తించి వారిని పోటీలో ఉండేందుకు ముందస్తు ప్రచారం మొదలు పెట్టమని ఆదేశించినట్లు చెప్పారు.

ఎక్కడినుండి ఎవరు పోటీ 
1 వార్డు నుండి చింతల ఫణి సునీత శ్రీనివాస్ రెడ్డి. 2 వార్డ్ వానరాశి మరియమ్మ మార్క్. 3 వార్డ్ సందుల సురేష్. 4 వార్డ్ గుత్త శమంత రెడ్డి.5 వార్డ్ చింతకింది మురళి. 6 వార్డ్ అంగిడి ఆంజనేయులు 7 వార్డ్ బిజన (సిద్దంకి) బాలమణి భాస్కర్. 8 వార్డ్ పాము అనిత. 9 వార్డ్ పస్తం ఆంజనేయులు.10 వార్డ్ మల్లెల సరిత శ్రీకాంత్.11 వార్డ్ జూకంటి సంపత్. 12 వార్డ్ జెట్ట నీరజ సిద్ధులు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.

పార్టీ బీఫామ్ వస్తుందన్న నమ్మకంతో12 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సమన్వయ పరుచుకుంటూ వార్డులలో ప్రభావితం చేసే  వ్యక్తులను యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు పోటీలో ఉండే కౌన్సిలర్లు మంగళవారం ఉదయం నుండే మంతనాలు ప్రారంభించారు.

ఆలేరు మున్సిపాలిటీ ఏర్పడి తర్వాత రెండో ఎన్నిక 
ఆలేరు మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత ఇది రెండవ ఎన్నికలు మొదటి ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో అధికార పార్టీ బి ఆర్ ఎస్ పార్టీ 8 స్థానాలు గెలిచి చైర్మన్ వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది.కాంగ్రెస్ పార్టీ ఒకటి ఇండిపెండెంట్లు రెండు బిజెపి ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి.గతంలో ఆలేరు మున్సిపాలిటీలో భాగంగా ఉన్న సాయి గూడెం 954 ఓటర్లతో నూతన గ్రామపంచాయతీ గా ఏర్పాటయింది.ఈసారి జరిగే ఎన్నికల్లో 13663 మొత్తం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయి గూడెం ఓటర్లు తగ్గినప్పటికీ నూతన 960 ఓటర్లుగా నమోదయ్యారు.

గతంలో బీసీ జనరల్ చైర్మన్ పదవి రిజర్వేషన్ అయ్యింది. ప్రస్తుతం బీసీ మహిళగా రిజర్వేషన్ ఖరారైంది.ఈసారి ఆలేరు పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య ఎక్స్ అఫీషి యో ఓట్లను ఉపయోగించి ఎమ్మెల్సీలను సిద్ధం చేసినట్లు తెలిసింది.అప్పటి ఎన్నికల్లో బి ఆర్ ఎస్ ఎనిమిది స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఒక్కటే గెలిచినప్పటికీ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 932 వచ్చింది..గతంలో ఓడిపోయిన వారిని కొందరు కొత్త వారిని సామాజిక పొందికలో భాగంగా మరి కొందరిని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి దించింది.

మోగిన మున్సిపల్ ఎన్నికల నగార 
మంగళవారం సాయంత్రం మున్సిపల్ ఎలక్షన్ కోడ్ ప్రకటించి ఎన్నికల షెడ్యూల్ అధికారులు ప్రకటించారు. ఈ నెల 27 నుండి 30  వరకు నామినేషన్ ప్రక్రియ 31 నుండి ఫిబ్రవరి 3 వరకు ఉపసంహరణ ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు. ఫిబ్రవరి 13న ఫలితాలు ఉంటాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -