Friday, March 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహైకోర్టు బార్‌ అసోసియేషన్‌ విజేతలు వీరే

హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ విజేతలు వీరే

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హైకోర్టు అడ్వొకేట్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గానికి గురువారం జరిగిన ఎన్నికల ఫలితాలు రాత్రి వెలువడ్డాయి. అధ్యక్షుడిగా ఎస్‌.సురేందర్‌రెడ్డి గెలిచారు. ఆయనకు 1,396, చిక్కుడు ప్రభాకర్‌కు 1,121, ఎల్‌.రవిచందర్‌కు 929 ఓట్లు పోలయ్యాయి. ఉపాధ్యక్షుడిగా డీఎల్‌ పాండు, కార్యదర్శులుగా పి. శ్రవణ్‌ కుమార్‌ గౌడ్‌, కె. నిరంజన్‌రెడ్డి, అదనపు కార్యదర్శిగా క్రిష్ణ కీర్తన, ట్రెజరర్‌గా బాలాజీ బానోత్‌, స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ సెక్రటరీగా విష్ణువర్ధన్‌ జయసూర్య విజయం సాధించారు. ఎగ్జిక్యూటీవ్‌ సభ్యుడి (సీనియారిటీ 25ఏళ్లు)గా నాగులూరి కృష్ణ కుమార్‌ గౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 15 ఏండ్ల కేటగిరీ (జనరల్‌) జక్కా కొండారెడ్డి, రుక్మిణి పల్లెల (మహిళ), ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా కె.భార్గవి, జి.శిల్ప, జి.అరవింద్‌ కుమార్‌, ఆర్‌పి నాయక్‌, పి.రవి ఎన్నికయ్యారు. రికార్డు స్థాయిలో ఇద్దరు మహిళలకు ఓట్లు వచ్చాయి. రుక్మిణి (2515), క్రిష్ణ కీర్తన (2306) చొప్పున సాధించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -