Thursday, July 17, 2025
E-PAPER
Homeసినిమాఅవన్నీ సర్‌ప్రైజ్‌ చేస్తాయి

అవన్నీ సర్‌ప్రైజ్‌ చేస్తాయి

- Advertisement -

రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్‌ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతూ రూపొందిన చిత్రం ‘జూనియర్‌’. రాధా కృష్ణ దర్శకుడు. శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, జెనీలియా కీలక పాత్ర పోషించారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 18న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం నటి జెనీలియా మీడియాతో ముచ్చటించారు.
13 ఏళ్ల తర్వాత సౌత్‌ సినిమా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నా భర్త రితేష్‌ ఈ కథ గురించి చాలా పాజిటివ్‌గా చెప్పారు. అలాగే దర్శకుడు కథని, నా పాత్రను చెప్పిన విధానం నాకు ఎంతగానో నచ్చాయి. ఇందులో నా పాత్ర చాలా స్పెషల్‌. ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్‌ చేయలేదు. అందుకే తప్పకుండా ఈ సినిమా చేయాలని డిసైడ్‌ అయ్యాను. ఇందులో ఓ మంచి బాస్‌ క్యారెక్టర్‌ నాది. సినిమా ముందుకెళ్తున్న కొద్ది నా క్యారెక్టర్‌లో చాలా మార్పులు వస్తాయి. అవన్నీ కూడా చాలా కొత్తగా సర్‌ప్రైజ్‌ చేసేలా ట్రీట్‌ చేశారు దర్శకుడు.
నేను ఇప్పటివరకు చాలామంది కొత్త నటీనటులతో పనిచేశాను. అయితే కిరీటి మాత్రం చాలా కాన్ఫిడెంట్‌ యాక్టర్‌. అద్భుతమైన డాన్సర్‌, పెర్ఫార్మెన్స్‌. శ్రీలీల కూడా అమేజింగ్‌ డాన్సర్‌. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌తో ‘సై’ సినిమా చేశా. చాలా రోజుల తర్వాత ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. దేవిశ్రీప్రసాద్‌ అద్భుతమైన కంపోజర్‌. ప్రతి సినిమాకి ఒక అద్భుతమైన ఎనర్జీ తీసుకొస్తారు. ఇందులో ‘వైరల్‌ వయ్యారి’ పాట సూపర్‌ హిట్‌ అయింది. ఈ సినిమాని నిర్మాత సాయి ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించారు. నా కోస్టార్స్‌ రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌, బన్నీ.. సూపర్‌ స్టార్స్‌గా ఎదగటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
రితేష్‌తో ‘మజిలీ’ రీమేక్‌ చేశాం. అది అద్భుతమైన విజయాన్ని ఇచ్చింది. మంచి లవ్‌ స్టోరీ కుదిరితే సినిమా చేస్తాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -