శర్వా నటిస్తున్న నయా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకుడు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. ఈ సినిమాని జనవరి 14వ తేదీన సాయంత్రం 5:49 గంటలకు ఫస్ట్ షోతో థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. మేకర్స్ తాజాగా టీజర్‌ను లాంచ్ చేశారు.
సి.ఎమ్.ఆర్. ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శర్వా మాట్లాడుతూ,’ మనం అనుకున్నది సాధించే శక్తి మన అందరిలో ఉంటుంది. ఎవరి ఒపీనియన్స్ పై ఆధారపడకండి. ఎందుకంటే మన లైఫ్‌ని మనమే బతకాలి. కష్టపడి చదవండి. భయపడకండి. అనుకున్నది సాధించండి. ఎంజాయ్ చేయండి. ఈ సినిమా గురించి ఒకటే విషయం చెప్తాను. సినిమా పొట్టపగిలి నవ్వేలా ఉంటుంది. జనవరి 14న రిలీజ్ అవుతుంది. 5:49 ఫస్ట్ షో. తప్పకుండా అందరూ థియేటర్స్‌లో చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు’ అని తెలిపారు.
నవ్వుతూనే ఉంటారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



