- Advertisement -
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పౌరహక్కుల సంఘం(సీఎల్‌సీ) రాష్ట్ర మూడో మహాసభలు శని, ఆదివారాల్లో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్నాయని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం లక్ష్మణ్, ఎన్ నారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు జరగనున్న ప్రారంభ సభలో ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి, ప్రొఫెసర్ జి హరగోపాల్, ప్రారంభ ఉపాన్యాసకులుగా ముంబయి హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ కోల్సేపాటిల్, సామాజిక కార్యకర్త బేలా బాటియా పాల్గొంటారని పేర్కొన్నారు. మొదటి రోజు నాలుగు సెషన్లుగా పలు అంశాలపై జర్చ జరుగుతుందని తెలిపారు.
- Advertisement -



