Wednesday, January 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఈ తరం 'ఆత్రేయపురం బ్రదర్స్‌'

ఈ తరం ‘ఆత్రేయపురం బ్రదర్స్‌’

- Advertisement -

ఒక్కప్పటిలా లేవు రోజులు.. ట్రెండ్‌ మారింది. అందుకు తగ్గట్టుగా ఆడియన్స్‌ ఆలోచనలు, టేస్ట్‌ కూడా మారిపోయాయి. కాబట్టి ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యే కొత్త కొత్త కథలతోనే మేకర్స్‌ సినిమాలు ప్లాన్‌ చేస్తున్నారు. అలాంటి ఓ వైవిద్యభరితమైన స్టోరీ తీసుకొని, ఇప్పటితరం ఆడియన్స్‌ కోరుకునే అన్ని అంశాలతో ‘ఆత్రేయపురం బ్రదర్స్‌’ అనే సినిమా రూపొందిస్తున్నారు డైరెక్టర్‌ రాజేష్‌ జగన్నాతం.
ఎస్‌2ఎస్‌ సినిమాస్‌, ది ఫెర్వేంట్‌ ఇండీ ప్రొడక్షన్స్‌ బ్యానర్లపై వీఎస్‌కే సంజీవ్‌, వంగపల్లి సందీప్‌, వంగపల్లి సంకీర్త్‌, ప్రవీణ్‌ గద్దె, రాజేష్‌ గద్దె, రాకేష్‌ గద్దె నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజీవ్‌ కనకాల, గవిరెడ్డి, సన్నీ పత్సా, రఘు బాబు, గీత్‌ సాయిని, నేహా పఠాన్‌, సిద్దార్థ్‌ గొల్లపూడి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈ సినిమా పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్‌ వశిష్ట, డైరెక్టర్‌ అనుదీప్‌, డైరెక్టర్‌ ఆదిత్య హాసన్‌, డైరెక్టర్‌ ప్రవీణ్‌ కాండ్రేగుల హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి వశిష్ట క్లాప్‌ కొట్టగా, విజయ్ కనకమేడల కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు.

ప్రవీణ్‌ కాండ్రేగుల, ఆదిత్య హాసన్‌ స్క్రిప్ట్‌ అందించారు. మరో డైరెక్టర్‌ అనుదీప్‌ మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా మేకర్స్‌ రిలీజ్‌ చేసిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఏ స్వీట్‌ రైవల్రీ అనే ట్యాగ్‌లైన్‌తో ఇద్దరు వ్యక్తులు బల పరీక్ష చేసుకుంటున్నట్లుగా ఈ పోస్టర్‌ డిజైన్‌ చేశారు. ఇది చూస్తుంటే, ఈ సినిమా కథలో వైవిధ్యం ఉంటుందని, గత సినిమాల కంటే ఈ సినిమా భిన్నంగా ఉండబోతుందని అర్థమవుతోంది. అతిత్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు. రాజీవ్‌ కనకాల, గవిరెడ్డి, సన్నీ పత్సా, రఘు బాబు, గీత్‌ సాయిని, నేహా పఠాన్‌, సిద్దార్థ్‌ గొల్లపూడి తదితరులు ముఖ్యతారాగణంగా నటిస్తున్న ఈచిత్రానికి రైటర్‌, దర్శకత్వం: రాజేష్‌ జగన్నాథం, నిర్మాతలు: సంజీవ్‌, వంగపల్లి సందీప్‌, వంగపల్లి సంకీర్త్‌, ప్రవీణ్‌ గద్దె, రాజేష్‌ గద్దె, రాకేష్‌ గద్దె, సంగీతం: సంతు ఓంకార్‌, ఎడిటర్‌: అనిల్‌ పసల.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -