Tuesday, April 14, 2026
E-PAPER
Homeసినిమాఇది ప్రతి ఊరి కథ

ఇది ప్రతి ఊరి కథ

- Advertisement -

నూతన ప్రతిభను ఎంకరేజ్‌ చేస్తూ హీరో కిరణ్‌ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్‌ పై నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’.
సాయి తేజ్‌, వేద జలంధర్‌ హీరో, హీరోయిన్స్‌గా, వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. సోమవారం దర్శకుడు వి.మునిరాజు మీడియాతో సంభాషించారు.
ఈ కథకు స్పూర్తి నేను చిన్నప్పుడు చూసిన ఘటనలే. నేను చూసిన మనుషుల క్యారెక్టర్‌లు, వారి భావోద్వేగాలు, నా చిన్నప్పటి అనుభవాలు ఇవన్నీ ఈ మూవీలో చిత్రీకరించాను. నేను తెరపై ఒక కథ చెప్పాలనుకున్నప్పుడు అది నా ఊరి కథే ఎందుకు కాకూడదు అనిపించింది. మా ఊరికి మొదటిసారి టీవీ వచ్చినప్పుడు మా ఊరికి దగ్గరలోని థియేటర్‌ కదిలి వచ్చిందా అనే భావన నాలో కలిగింది. ఇది ప్రతి ఊరి కథ. 40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ టీవీ నేపథ్యంగా నేను చూసిన ఘటనలు చూసే ఉంటారు. ఊరి మనుషులు, వారి మధ్య అహం వంటి అంశాలు చూపిస్తూనే చివరలో మంచి ఎమోషనల్‌ కంటెంట్‌ చెబుతున్నాం.
ఈతరం జెన్‌జీ కిడ్స్‌కు కూడా మా సినిమా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈతరం పిల్లలకు అప్పటి మన కల్చర్‌, సంప్రదాయాలు తెలియవు, అప్పుడు మనమంతా ఎలా ఉండేవాళ్లమో తెలియదు. కాబట్టి మా సినిమాలోని వాతావరణం అంతా వాళ్లకు కొత్తగా ఉంటుంది. ఈతరం పిల్లలు చూడని ప్రపంచం, చూడని విషయాలు మా మూవీలో ఆకట్టుకుంటాయి. ఇది ఫ్యూర్‌ సస్పెన్స్‌ డ్రామా చిత్రమిది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నెక్ట్స్‌ ఏం జరుగుతుంది అని సీట్‌ ఎడ్జ్‌లో కూర్చుని చూస్తారు. చివరకు మంచి ఎమోషనల్‌ ఫీల్‌తో థియేటర్‌ నుంచి బయటకు వస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -