Friday, February 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుక్క విశ్వాసం అంటే ఇదీ..

కుక్క విశ్వాసం అంటే ఇదీ..

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు
కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి ఉండదు అనేది ఒక సామెత. కానీ అది నిత్య సత్యం అని గుండెలను కదిలించింది ఓ సంఘటన. అది ఎక్కడో కాదు మునుగోడు మండలంలోని కిష్టాపురంలో చోటు చేసుకుంది. కిష్టాపురం గ్రామానికి చెందిన నందిపాటి పార్వతమ్మ వృద్ధురాలు  పెంపుడు కుక్క ను ఎంతగానో ప్రేమగా సాదుకుంది. గత రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురై ఆమె మృతి చెందింది. గురువారం అంత్యక్రియలు నిర్వహించక ముందు భౌతికయాన్ని ఫ్రిజ్ లో పెట్టగా.. ఆ మూగ జీవి చూపించిన ప్రేమ అందరి గుండెలను కదిలించే విధంగా ఆ కుక్క తల్లడిల్లుతున్న తీరును చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు. యజమాని పెట్టిన పిడికెడు అన్నంకు మూగ జీవి యజమాని సమాధి చేసిన స్మశాన వాటికలో కూటికి , నీటికి దూరమై కుక్క తమ విశ్వాసాన్ని నిరూపించుకుందని కుటుంబ సభ్యులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కుక్క విశ్వాసం చాలా గొప్పదని వీక్షించిన వారు కొనియాడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -