Wednesday, December 17, 2025
E-PAPER
Homeసినిమాఈ అఖండ విజయం గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది

ఈ అఖండ విజయం గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది

- Advertisement -

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రూపొందిన చిత్రం ‘అఖండ 2: ది తాండవం. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌ పై రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు.
ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ రెస్పాన్స్‌తో, హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ బోయపాటి శ్రీను మీడియాతో ముచ్చటించారు.
ఈ అఖండ విజయాన్ని ఎంత ఫీలైనా తక్కువే. ఇంకా కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా డబ్బు కోసం తీసింది కాదు. ఈ సినిమా ప్రజలకు చేరాలని తీశాం. మన తత్వం ఏమిటి?, ప్రపంచంలో ఎవరైనా మనల్ని చూసి చేతులెత్తి దండం పెడతారు ఎందుకు?, మనం ఆచరించే ధర్మం కోసం. మనం బిడ్డ పుట్టగానే పేగు తెంచి దేవుడికి ముడి వేస్తాం. దేవుడు పేరు పెట్టుకుంటాం. ఎదుగుతుంటే దేవుడు దయ అంటారు. చివరికి లోకాన్ని విడిచినప్పుడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాడు అంటాం. మనకి కష్టం వచ్చినా దేవుడే, ఆనందం వచ్చిన దేవుడే. అలాంటి అంశాలతో ఒక గొప్ప దారిని ఎంచుకుని తీసిన సినిమా ఇది. ఈ సినిమా చాలా పవర్‌ఫుల్‌గా కమర్షియల్‌ అంశాలతో తీయడం జరిగింది.

ఆడియన్స్‌ కూర్చుంటే ఊపిరి బిగబెట్టుకొని చూస్తున్నారు. అలాంటి అనుభూతిని అందిస్తున్న సినిమా ఇది. థియేటర్స్‌ విజిట్‌కి వెళ్ళినప్పుడు ఆ రెస్పాన్స్‌ని మాటల్లో చెప్పలేను. ఒక మంచి సినిమా తీసి ఆశించాల్సింది డబ్బు కాదు గౌరవం. అలాంటి గౌరవం వచ్చింది. సహజంగా థియేటర్స్‌ విజిట్‌కి వెళ్ళినప్పుడు అందరూ నిలబడి విజల్స్‌, క్లాప్స్‌ కొడతారు. కానీ ఈ సినిమాకి వెళ్ళినప్పుడు అందరూ లేచి చేతులెత్తి దండం పెట్టారు. నేను కూడా ‘మీ అందరి స్పందన చూడడానికే వచ్చానని’ అందరికీ నమస్కరించి వచ్చాను. నిజంగా ఇది చాలా గొప్ప అనుభూతి. ముఖ్యంగా ఈ సినిమాలో మన ధర్మం మన తల్లి లాంటిది. మన తల్లి గురించి అద్భుతంగా చెప్పాము. మన ధర్మాన్ని మనం ఫాలో అయితే అద్భుతంగా ఉంటామని చెప్పాము. థియేటర్స్‌లో చిన్న పిల్లలు ఎక్కువమంది ఉన్నారు. వాళ్ళ కేరింతలు చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. కర్ణాటక, చెన్నై, హిందీలో సినిమా ఉర్రూతలూగుతుంది. మారుమూల గ్రామాల్లో కూడా సినిమా ఆడుతోంది. అద్భుతమైన రెస్పాన్స్‌ ఉంది. రెవిన్యూ పరంగా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం. త్రీడీలో ఇంకా అద్భుతంగా ఉంటుంది. మరో 10 రోజుల్లోనే నా నెక్స్ట్‌ సినిమా వివరాలు చెప్తాను.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -