Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈ శ్రమ్ కార్డును సద్వినియోగం చేసుకోవాలి

ఈ శ్రమ్ కార్డును సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి  
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఇ-శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించిందని, అసంఘటిత కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వేణుగోపాల్ అన్నారు. శనివారం అంబేద్కర్ చౌక్ లేబర్ అడ్డా లో ఇ ఆశ్రమ్ కార్డు పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకుంటే, వారికి రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం లభిస్తుందన్నారు. వాస్తవానికి, రిజిస్టర్డ్ కార్మికుడు ప్రమాదానికి గురైతే, మరణం లేదా అంగవైకల్యం సంభవించినట్లయితే, అతనికి రూ.2 లక్షలు బీమా సంస్థ చెల్లిస్తుందన్నారు. ఇది కాకుండా, కార్మికుడు పాక్షికంగా అంగవైకల్యం పొందితే, అప్పుడు అతనికి ఈ పథకం కింద లక్ష రూపాయలు లభిస్తుందన్నారు. అనంతరం పలువురికి ఇ శ్రమ్ కార్డులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రఫీ, మద్దిలేటి, నిశాంత్,సిఐటియు జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -