- Advertisement -
ముంబయి, వడోదరలో డబ్ల్యూపీఎల్
ముంబయి : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ జనవరిలోనే ఆరంభం కానుంది. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు మహిళల ప్రీమియర్ లీగ్ నిర్వహణకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు డబ్ల్యూపీఎల్ వేలం సందర్భంగా లీగ్ చైర్మెన్ జయేశ్ రంజన్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. నవీ ముంబయిలోని డివై పాటిల్ స్టేడియం, కొటంబి స్టేడియాలు తొలి దశ డబ్ల్యూపీఎల్‌కు ఆతిథ్యం ఇవ్వనుండగా.. రెండో దశ, ప్లే ఆఫ్స్, ఫైనల్‌కు గుజరాత్‌లోని వడోదర వేదిక కానుంది. డబ్ల్యూపీఎల్ తొలి మూడు సీజన్లు ఫిబ్రవరి-మార్చిలో జరుగగా.. తొలిసారి లీగ్ జనవరిలోనే ఆరంభం కానుంది.
- Advertisement -



