Thursday, March 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేజీబీవీ, యుఆర్‌ఎస్‌, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై మూడు దశల పోరాటం

కేజీబీవీ, యుఆర్‌ఎస్‌, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై మూడు దశల పోరాటం

- Advertisement -

టీఎస్‌ యూటీఎఫ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో, పట్టణ గురుకులాల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తాత్సార వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) ఆధ్వర్యంలో దశలవారీ పోరాటం చేయాలని ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.కేజీబీవీ, యుఆర్‌ఎస్‌, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు దీర్ఘకాలంగా అపరిస్కృతంగా ఉన్నాయని తెలిపారు. రెండు దశాబ్దాలుగా పని చేస్తున్నప్పటికీ వేతనాలు అరకొరగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చేసిన అనేక పోరాటాల సందర్భంలో సర్వీసు కండీషన్లకు సంబంధించి అధికారులు ఇచ్చిన హామీలు అమలు జరగకపోగా గత సంవత్సరం 29 రోజులు సమ్మెచేసిన సమయంలో డిప్యూటీ సీఎంతో జరిగిన చర్చల సందర్భంగా అంగీకరించిన అంశాలు కూడా ఇప్పటి వరకు అమలుకు నోచుకో లేదని విమర్శించారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించక పోగా పోరాడితే కక్షతో మరింత ఇబ్బందులకు గురి చేయడం తగదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి శ్రమకు తగిన వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఓలను ప్రిన్సిపాల్స్‌గా, పీజీసీఆర్టీలకు జేఎల్‌గా, సీఆర్టీ/పీఈటీ/ సీఆర్పీపీపీలను ఎస్‌ఏలుగా పరిగణించి కనీస మూలవేతనాన్ని చెల్లించాలనీ, ఆరోగ్య భద్రత కల్పించడం కోసం హెల్త్‌ కార్డులు జారీ చేయాలనీ కేర్‌ టేకర్లను నియమించి, రాత్రి కాపలా డ్యూటీల నుంచి విముక్తి చేయాలని కోరారు.
సమస్యల పరిష్కారం కోసం మూడుదశల పోరాటంలో భాగంగా మార్చి 9న (సోమవారం) పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలతో భోజన సమయంలో నిరసన ప్రదర్శ నలు, మార్చి 16న (సోమవారం) జిల్లా కేంద్రాల్లో/డివిజన్‌ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే మార్చి 20న (శుక్రవారం) అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా చలో అసెంబ్లీ నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ బడ్జెట్‌ సమావేశాల్లోపే సమస్యలపై సానుకూల నిర్ణయాలు తీసుకోవాలనీ, ప్రాజెక్టు అప్రూవల్‌ బోర్డు (పీఏబీ)లో కనీస వేతనాలకు సరిపడా నిధులకు ప్రతిపాదనలు పంపించాలని కోరారు. లేనియెడల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -