Friday, February 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అడ్డదారి గుండా.. అడ్డగోలు రవాణా

అడ్డదారి గుండా.. అడ్డగోలు రవాణా

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ టు మహారాష్ట్రకు, అటు నుంచి ఇటు అడ్డదారి మద్నూర్ మండల కేంద్రం పెద్ద తడగూర్ రహదారి గుండా రాత్రింబవళ్ల తేడా లేకుండా వందల సంఖ్యలో లారీలు తరలిస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దులోని సలాబత్పూర్ గ్రామ సమీపంలోని అంతర్రాష్ట్ర ఆర్టీవో శాఖ వాణిజ్య పన్నుల శాఖ చెక్పోస్టులను ఎత్తివేతతో ఈ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని స్థానికులు వాపోయారు. జీరో దందాలతో ఓవర్ లోడ్ లారీలతో సరుకులను ఇతర రాష్ర్టాలకు చాలా సులభంగా తరలిస్తున్నారు.

ఎందుకంటే మన రాష్ట్ర సరిహద్దు మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ బార్డర్ ప్రాంతంలో ఆర్టీవో శాఖ చెక్పోస్ట్ ఎత్తివేయకుండా కొనసాగిస్తూ ఉంది. ఓవర్ లోడ్ లారీలను భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తుండడంతో అడ్డుదారిగుండా తరలిస్తున్నారు. ఇలాంటి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు చాలా రోజులుగా భారీగా గండి పడుతోందని చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ అడ్డగోలు రవాణాకు అడ్డుకట్ట వేసి, ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని రాబట్టాలని స్థానిక ప్రజానీకం కోరుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -