Friday, September 12, 2025
E-PAPER
Homeజిల్లాలుఅవుపై పులి దాడి.!

అవుపై పులి దాడి.!

- Advertisement -

భయాందోళనకు గురవుతున్న ప్రజలు 
జాడ కోసం అటవీ శాఖ అధికారుల అన్వేషణ 
నవతెలంగాణ – మల్హర్ రావు
: కొయ్యుర్ రేంజ్ పరిధి అడవుల్లో పులి సంచారం చేస్తోందని పశువుల కాపర్లు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటీవల కొయ్యుర్ అటవీశాఖ అధికారులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన గుర్రం లింగయ్య కు చెందిన అవుపై పులి దాడిచేసి చంపిన సంఘటన బొగ్గులవాగు ప్రాజెక్టు అడవుల్లో శుక్రవారం వెలుగులోకి వచ్చింది.దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.విషయం తెలుసుకున్న కొయ్యూరు అటవీ శాఖ అధికారి రాజేశ్వర్ రావు తో కలిసి సిసిఎఫ్ఓ ప్రభాకర్ రెడ్డి, డిఎఫ్ఓ నవీన్ రెడ్డి లు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి పులికి పాద ముద్రలు గుర్తించి ఆవును చంపింది పులి అని నిర్ధారించారు. పులి ఎటువైపు వెల్లిందో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పులి పాద ముద్రలు గుర్తించి జాడ కోసం ట్రాప్ కెమెరాలు అమర్చి అన్వేషణ ప్రారంభించారు. తాడిచర్ల అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుందన్న వార్త ధావనంలా వ్యాపించడంతో కొయ్యూరు, రుద్రారం, కిషన్రావుపల్లీ, పెద్దతూoడ్ల, శాత్రజ్ పల్లె, తాడిచర్ల గ్రామాల ప్రజలు బిక్కుమంటున్న పరిస్థితి నెలకొంది. పులి సంచారంతో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. పశువుల కాపరులు, ప్రజలు అటవీ ప్రాంతంలోకి వెల్లవద్దని పులి అనవాలు కనిపిస్తే సమాచారం అందించాలని తెలిపారు.పులి దాడిలో హతమైన ఆవు కాళేబరాన్ని పంచనామా నిర్వహించారు. బాధిత రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని అటవీశాఖ అధికారులు హమీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -