Sunday, November 9, 2025
E-PAPER
Homeదర్వాజకాలం టు ది పవర్‌ ఆఫ్‌ కాలం

కాలం టు ది పవర్‌ ఆఫ్‌ కాలం

- Advertisement -

నువ్వు చెయ్యవు.
కాలం
నీచేత కొన్ని పనులు చేయిస్తది

నువ్వు చనిపోవాలనుకోవు
కాలం నిన్ను
అవసరానికి మించి ఉండనవవసరం లేదంటది

శరీర భాగాలన్నీ కాలంలో పుట్టి పెరిగినవే
కాలం
వాటిని తప్పనిసరిగా ఉపసంహరించుకుంటది

తెరమీద ఉన్నంత సేపు
అస్సలు విశ్రాంతి తీసుకోలేవు
కాలం ఒడుపుగా తెరను తొలగిస్తది

ఎదురు పడ్డా పలకరించని వాళ్ళు
వెతుక్కుంటూ వచ్చేలా చేస్తుంది
చిత్రమైన కాలం

అయిన వాళ్లందరు దూరం జరిగేది
దూరమైన వాళ్లంతా దగ్గరకు చేరేది
ఈ కాలం యవనిక మీదే

సముద్రపు నీరంతా జీవుల కన్నీరే
కాలం మితిమీరి
అందులో ఉప్పుగా దాగింది

కాలం కలిసొస్తే సున్నాకు ముందర ఒకటి
కాలం కలహిస్తే సున్నాకు అవతల ఒకే ఒక్కటి
అంతే మరి! కాలం టు ది పవర్‌ ఆఫ్‌ కాలం

  • ఏనుగు నరసింహారెడ్డి, 8978869183
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -