తెలంగాణ వ్యవసాయ కార్మిక జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ….
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని హన్మాపురం గ్రామంలోని సర్వేనెంబర్ 87లని 15 ఎకరాల 12 గుంటల ప్రభుత్వ భూమిని సేద్యం చేసుకుంటున్న దళిత కుటుంబాలకు వెంటనే పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి మండల పరిధిలోని హన్మామాపురం గ్రామంలోని సర్వేనెంబర్ 87లో సేద్యం చేసుకుంటున్న ప్రభుత్వ భూములను పరిశీలన చేసి, మాట్లాడారు. గత 70, 80 సంవత్సరాలుగా దళితులు ప్రభుత్వ భూమిని సేద్యం చేసుకొని బతుకు తున్నారని అన్నారు. నాటినుండి అనేకమార్లు ప్రభుత్వానికి పట్టా సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు పెట్టుకొని ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నారని కానీ నేటికీ పట్టా సర్టిఫికెట్లు ఇవ్వలేదని ఇప్పటికైనా వెంటనే పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని నర్సింహ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జియంపిఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నర్సింహ్మ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, సాగు దారులు మూడుగుల రాజు, మూడుగుల బాల్ నర్సింహ, బండారి ఉప్పలయ్య, సింగారం బిక్షపతి, మూడుగుల ఉప్పలయ్య, సింగారం జహంగీర్ , మూడుగుల పరమేష్ , బండారి ప్రభాకర్ , మూడుగుల మహేష్ , మూడడుగుల లింగం లు పాల్గొన్నారు.
దళితుల భూములకు పట్టా సర్టిలివ్వాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES