No menu items!
Sunday, August 24, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్ఎల్లారెడ్డి ఎమ్మెల్యేను కలిసిన టిఎన్జీవోఎస్ నాయకులు 

ఎల్లారెడ్డి ఎమ్మెల్యేను కలిసిన టిఎన్జీవోఎస్ నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి  అధ్యక్షతన వారి యొక్క బృందం కామారెడ్డి జిల్లా కేంద్రంనికి వచ్చిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా పక్షాన శాలువాతో సత్కరించి, పూల మొక్కను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కామారెడ్డి జిల్లాలో వివిధ శాఖలలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించగా, ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, వాటి యొక్క పరిష్కారానికి కృషి చేస్తానని మదన్ మోహన్ రావు  హామీ ఇవ్వడం జరిగినదనీ జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి తెలిపారు. ఆయనను కలిసిన వారిలో కార్యదర్శి ఎం నాగరాజు, కోశాధికారి ఎం దేవరాజు, అర్బన్ తాలూకా అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి, ఉద్యోగులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad