Friday, March 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంక్రీడా స్ఫూర్తి చాటి చెప్పడానికే..

క్రీడా స్ఫూర్తి చాటి చెప్పడానికే..

- Advertisement -

శాసనసభ్యుల క్రీడా పోటీలు : మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

క్రీడా స్ఫూర్తి చాటి చెప్పడానికే శాసనసభ్యుల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి తెలిపారు. ఈనెల 28, 29 తేదీల్లో జరగబోయే శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల క్రీడా పోటీలు మొదటి ఎడిషన్‌ లెజిస్టేటర్‌ స్పోర్ట్స్‌ మీట్‌ 2026 నిర్వహణ సన్నాహక సమావేశం గురువారం అసెంబ్లీలోని కమిటీ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పోటీలు మొట్టమొదటిసారిగా నిర్వహించబోతున్నామనీ, పార్టీల బేధ భావాలు పక్కనపెట్టి శాసనసభ్యులు అందరూ ఈ క్రీడల్లో పాల్గొంటున్నారని తెలిపారు.

ఇందుకోసం శాసనసభ, సచివాలయం, తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ, రాష్ట్ర సాంస్కృతిక శాఖ తోపాటు వివిధ శాఖల సమన్వయంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని చెప్పారు. ప్రారంభ వేడుకలు హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో 28వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతాయనీ, సీఎం రేవంత్‌ రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొంటారని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -