Thursday, March 26, 2026
E-PAPER
Homeమానవిచెమటకాయలు పోవాలంటే…

చెమటకాయలు పోవాలంటే…

- Advertisement -

వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్యల్లో చెమటకాయలు ఒకటి. వీటి కారణంగా చర్మం దురద పెట్టటమే కాకుండా చర్మం మదుత్వాన్ని కోల్పోతుంది. కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే చాలా సులభంగా వీటి నుంచి బయటపడొచ్చు.

పెరుగు : చెమట కాయలు ఉన్న ప్రదేశంలో చల్లని పెరుగుని అప్లై చేసి 15 నిమిషాలు ఉంచాలి. తరువాత చల్లని నీటితో కడిగేసి మెత్తని బట్టతో తుడవాలి. పెరుగులో సహజంగా ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ ప్రాపర్టీస్‌ చెమటకాయలు రాకుండా చేస్తాయి.
గంధం : గంధానికి చల్లని ఫుల్‌ ఫ్యాట్‌ మిల్క్‌ కలిపి ఆ మిశ్రమాన్ని చెమట కాయలు ఉన్న ప్రదేశంలో పట్టించి గాలికి ఆరనివ్వాలి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేయాలి.

కలబంద : చెమటకాయలు ఉన్న ప్రదేశంలో కొంచెం కలబంద గుజ్జు రాస్తే త్వరగా తగ్గిపోతాయి. కలబందలో ఆస్ట్రిజెంట్‌ లక్షణాలు ఉండటం వలన చెమటకాయలు త్వరగా తగ్గటానికి సహాయపడతాయి. చర్మంపై ఉండే ఇన్‌ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది.
వెనిగర్‌ : టిష్యూ పేపర్‌ను తీసుకుని వెనిగర్‌లో ముంచి చెమట కాయలు ఉన్న ప్రదేశంలో అద్దాలి. ఇలా చేస్తే చెమట కాయలు త్వరగా తగ్గిపోతాయి.
లవంగ నూనె : కాటన్‌ బాల్‌ను తీసుకుని లవంగ నూనెలో ముంచి చెమటకాయలు ఉన్న ప్రదేశంలో రాస్తే చెమట కాయలు తగ్గుముఖం పడతాయి. తరచూ ఇలా చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -