Saturday, May 10, 2025
Homeతెలంగాణ రౌండప్పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభం..

పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభం..

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ : రెంజల్ మండలంలోని బోర్గాం, కందకుర్తి గ్రామాలలో వజీర్ సుల్తాన్ టుబాకో (VST) కంపెనీ యాజమాన్యం పొగాకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ప్రతి ఏటా మార్చ్, ఏప్రిల్ నెలల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేవారు. కానీ ఈ ఏడాది మే నెలలో ప్రారంభించడంతో పాటు, తమకు బాండ్ రాసి ఇచ్చినటువంటి రైతుల వద్ద నుంచి మాత్రమే పొగకును కొనుగోలు చేయడంతో ఏలాంటి బాండ్ పేపర్ లేకుండా పొగాకు పండించిన రైతుల పరిస్థితి ఆందోళనగా మారింది. ప్రతి సంవత్సరం వి ఎస్ టి కంపెనీ యాజమాన్యం మాత్రమే ధర నిర్ణయించేది. ఈ ఏడాది ధరలో ఇలాంటి మార్పు చేయకుండానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. విఎస్టి అనుమతి లేకుండా పండించిన రైతులు తమ పొగాకు పంటను ప్రైవేటు వారికి వారు నిర్ణయించిన ధరకు మాత్రమే విక్రయించుకోవలసిన పరిస్థితి నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా వజీర్ టొబాకో  కంపెనీ యాజమాన్యం రైతులకు బాండు ల రూపంలో కొనుగోలు చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలబడింది. ఈ ఏడాది ప్రైవేట్ కంపెనీ యాజమాన్యాలు రాక పోవడంతో, రైతులు వి ఎస్ టి కంపెనీకి మాత్రమే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం క్వింటాలకు 13,500 ధర నిర్ణయించారు. పొగాకు రేటును బట్టి ధర నిర్ణయించబడుతుంది..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -