Thursday, March 12, 2026
E-PAPER
Homeజిల్లాలునేడు మొల్ల జయంతి

నేడు మొల్ల జయంతి

- Advertisement -

– మొల్ల జయంతి సందర్భంగా కుమ్మరి కులస్తులకు పిలుపు

– టి ఆర్ కె ఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు 

నవతెలంగాణ – కామారెడ్డి

తెలుగు సాహిత్యంలో అపూర్వమైన స్థానం సంపాదించిన మహాకవయిత్రి  జయంతి సందర్భంగా కుమ్మరి కులస్తులందరికీ తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ హృదయపూర్వక పిలుపునిస్తున్నాము అని ఒక ప్రకటనలో తెలిపారు. సమాజంలో  కుమ్మరి కులంలో సాధారణ కుటుంబంలో జన్మించి, తన ప్రతిభతో తెలుగు సాహిత్యాన్ని ఆ కాలంలోనే ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయురాలు కుమ్మర మొల్ల, ఆమె రచించిన మొల్ల రామాయణం తెలుగు భాషకు గొప్ప గౌరవాన్ని తెచ్చింది. అలాంటి మహనీయురాలి జయంతిని పురస్కరించుకొని శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ముందు నిర్వహించే మొల్ల  జయంతి కార్యక్రమానికి కుమ్మరి కులానికి చెందిన ప్రజా ప్రతినిధులు, అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు అందరూ పెద్ద సంఖ్యలో హాజరై, ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించాలనీ కోరుతున్నాం.  యువతకు కుమ్మర మొల్ల గారి గొప్పతనాన్ని తెలియజేసేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్పూర్తిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మన కుమ్మరి కులస్తుల ఐక్యతను చాటాలని కుమ్మరి కుల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -