- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల కేటాయింపునకు దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగియనుంది. చివరి రోజు కావడంతో అబ్కారీ భవన్‌లో హైదరాబాద్ డివిజన్ కౌంటర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గడువు పెంపుపై వస్తున్న వార్తలను ఎక్సైజ్ శాఖ ఖండించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 50 వేలకుపైగా దరఖాస్తులు అందాయి. శనివారం మరో 50 వేల దరఖాస్తులు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేవలం హైదరాబాద్ డివిజన్‌లోనే 179 షాపులకు 1,809 దరఖాస్తులు వచ్చాయి.
- Advertisement -



