Thursday, December 18, 2025
E-PAPER
Homeఆటలునేడు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టైటిల్‌ పోటీ

నేడు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టైటిల్‌ పోటీ

- Advertisement -

పూణే: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టైటిల్‌ పోటీ జరగనుంది. మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో గురువారం జరిగే ఫైనల్లో హర్యానా, జార్ఖండ్‌ జట్లు తలపడనున్నాయి. చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు మెరుగైన రన్‌రేట్‌తోనే ఫైనల్‌కు చేరాయి. సూపర్‌లీగ్‌లో భాగంగా మంగళవారం జరిగిన గ్రూప్‌-ఎ లీగ్‌ మ్యాచ్‌లో జార్ఖండ్‌ జట్టు ఆంధ్ర చేతిలో ఓటమిపాలైంది. మరోవైపు హర్యానా జట్టు ఏకంగా 124 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను చిత్తుచేసి గ్రూప్‌ టాపర్‌గా నిలిచింది. రెండు గ్రూపుల్లో టాప్‌లో నిలిచిన జట్ల మధ్య టైటిల్‌ పోరు జరగనుంది. గ్రూప్‌-ఎలో హర్యానా(+2.32), హైదరాబాద్‌(-0.41), ముంబయి(-0.70) 8పాయింట్లతో నిలిచినా.. మెరుగైన రన్‌రేట్‌తో టాపర్‌గా నిలిచింది. మరోవైపు గ్రూప్‌-బిలో జార్ఖండ్‌(+0.22), ఆంధ్రప్రదేశ్‌ (-0.11) 8పాయింట్లతో నిలిచాయి. కానీ మెరుగైన రన్‌రేట్‌తో హర్యానా, జార్ఖండ్‌ జట్లు తుదిపోరుకు అర్హత సాధించాయి. జార్ఖండ్‌ జట్టుకు ఇషాన్‌ కిషన్‌, హర్యానా జట్టుకు అంకిత్‌ కుమార్‌ సారథ్యం వహిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -