Friday, September 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడే ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్..

నేడే ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డ్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా వెల్ల‌డించారు. ఫస్ట్ ఇయ‌ర్‌లో 1,35,826 మంది, సెకండ్ ఇయర్‌లో 97,963 మంది సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకోవాలి అనుకునే విద్యార్థులు మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 అనే నంబర్‌కు వాట్సాప్ చేయడం ద్వారా పొందవచ్చు. అంతే కాకుండా https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే మే 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -