పోస్టర్ ఆవిష్కరించిన క్రీడా మంత్రి శ్రీహరి
హైదరాబాద్: తెలుగు ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) క్రికెట్ పోటీల పోస్టర్‌ను క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. క్రికెట్‌తో పాటు ఏదొక క్రీడలో యువత రాణించాలని, తద్వారా ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ కూడా అలవడుతుందని చెప్పారు. ‘సే నో టూ’ డ్రగ్స్ ప్రచారాన్ని యువతలోకి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న ఈ టీపీఎల్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. జూపర్ ఎల్‌ఈడీ సంస్థ సీఎస్‌ఆర్ నిధులతో ఈ పోటీలను నిర్వహిస్తుందని, తెలుగు రాష్ట్రాల్లో సుమారు 60 వేదికల్లో 600 టీమ్‌లు పోటీపడతాయని ఆ సంస్థ డైరెక్టర్ ఒ. రమేశ్ తెలిపారు. రూ. 80 లక్షల ప్రైజ్‌మనీ గల టీపీఎల్ నాకౌట్‌కు తెలంగాణ, ఏపీ నుంచి నాలుగు జట్ల చొప్పున ఎంపిక చేస్తారు.
600 జట్లతో టీపీఎల్
- Advertisement -
- Advertisement -



