Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుటాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ నిర్మాతగా, ఏఏ ఆర్ట్స్ అధినేతగా సుపరిచితులైన కె. మహేంద్ర (79) గత అర్ధరాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మహేంద్ర అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం గుంటూరులో జరగనున్నాయి. నిర్మాతగా ఆయన ప్రస్థానం 1977లో ‘ప్రేమించి పెళ్లి చేసుకో’ చిత్రంతో ఆరంభమైంది. ఆ తర్వాత ‘ఏది పుణ్యం? ఏది పాపం?’, ‘ఆరని మంటలు’, ‘తోడు దొంగలు’, ‘బందిపోటు రుద్రమ్మ’, ‘ఎదురులేని మొనగాడు’, ‘ఢాకూరాణి’, ‘ప్రచండ భైరవి’, ‘కనకదుర్గ వ్రత మహత్మ్యం’ వంటి అనేక విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad