- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేదని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. చొప్పదండిలోని జ్యోతినగర్ కు చెందిన వనపర్తి సంధ్య(27)కు ఈ నెల 14న వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ఈ పెళ్లి ఇష్టం లేదని మనోవేదనకు గురై శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంధ్య తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
- Advertisement -