Friday, November 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఫిజికల్‌ ఇంటెలిజెన్స్‌పై శిక్షణ

ఫిజికల్‌ ఇంటెలిజెన్స్‌పై శిక్షణ

- Advertisement -

8 వారాల పైలెట్‌ ప్రోగ్రాం అమలు : సీఎం రేవంత్‌రెడ్డితో ‘అనలాగ్‌ ఏఐ’ సీఈఓ కిప్మన్‌ భేటీ

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వీలైనంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎంను ‘అనలాగ్‌ ఏఐ’ సీఇఓ అలెక్స్‌ కిప్మన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిరువురూ పలు అంశాలపై చర్చించారు. ట్రాఫిక్‌, పట్టణ వరదలు, సరస్సుల రక్షణ, వాతావరణ అంచనా, పరిశ్రమల కాలుష్య నియంత్రణకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మార్గాలపై మాట్లాడుకున్నారు. ‘ఫిజికల్‌ ఇంటెలిజెన్స్‌’ ఆధారంగా రియల్‌ టైమ్‌ సెన్సార్‌ నెట్‌వర్క్‌, స్మార్ట్‌ సిటీ నిర్వహణ పద్ధతులపై పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టాలనీ, దీనికోసం 8 వారాల శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. సీసీ టీవీ వ్యవస్థను రియల్‌ టైమ్‌ సిటీ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫారమ్‌గా మార్చడంతో పాటు ట్రాఫిక్‌, ప్రజా భద్రత, అత్యవసర సేవలన్నీ ఏఐ ఆధారిత అంచనాలతో ఒకేచోట సమన్వయం చేసి, ఇంటిగ్రేటేడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా నిర్వహణ చేపడతారు. ఈ సందర్భంగా డిసెంబర్‌ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు రావాలని సీఎం అనలాగ్‌ సీఈఓను ఆహ్వానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -