Friday, September 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉద్యోగస్తులకు బదిలీ తప్పదు 

ఉద్యోగస్తులకు బదిలీ తప్పదు 

- Advertisement -

పూలే అంబేడ్కర్ జాతర కమిటీ రాష్ట్ర నాయకులు సుధాకర్ 
నవతెలంగాణ-మిడ్జిల్ 

ఉద్యోగస్తులకు బదిలీ తప్పదని ఉద్యోగంలో ఉన్నప్పుడు పేద ప్రజలకు సేవ చేస్తే స్థిర స్థాయిగా ప్రజలలో మనసులో నిలిచిపోతారని పూలే అంబేడ్కర్ జాతర కమిటీ రాష్ట్ర నాయకులు సుధాకర్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీదింటి సురేందర్, బహుజన ఉద్యమకారులు కూన స్కైలాబు అన్నారు. గడ్డల కృష్ణయ్య పదవి విరమణ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి మండలంలోని వాడియాల గ్రామంలోని కృష్ణయ్య స్వగృహంలో దళిత సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగేశ్వర్ జి,ప్రవీణ్ కుమార్, మాజీ సర్పంచ్ కంచనపల్లి నరసింహ, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -