నవతెలంగాణ – హైదరాబాద్: న్యాయవ్యవస్థలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మద్రాస్ హైకోర్టులో పనిచేస్తున్న జస్టిస్ బట్టు దేవానంద్‌ను తిరిగి ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇదే సమయంలో, తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్‌తో పాటు, గతంలో ఇతర రాష్ట్రాలకు బదిలీ అయిన ముగ్గురు న్యాయమూర్తులను తిరిగి తెలంగాణ హైకోర్టుకు తీసుకురావాలని ప్రతిపాదించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలో తొలిసారిగా సమావేశమైన కొలీజియం మొత్తం 10 రాష్ట్రాల హైకోర్టులకు చెందిన 21 మంది న్యాయమూర్తుల బదిలీలకు ఆమోదం తెలిపింది.
తెలంగాణకు తిరిగి వస్తున్న న్యాయమూర్తులు
గతంలో కర్ణాటక, పాట్నా హైకోర్టులకు బదిలీ అయిన ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ చిల్లకూరు సుమలత మళ్లీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ కానున్నారు.
హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES