నవతెలంగాణ- రాయపోల్
సిద్దిపేట జిల్లా పరిధిలోని తహసిల్దార్, డిప్యూటీ తహసిల్దార్లను, జిల్లా కలెక్టర్ కే. హైమావతి బదిలీ చేశారు. సిద్దిపేట రూరల్ మండలంలో డిప్యూటీ తహసిల్దారుగా విధులు నిర్వహిస్తున్న రాజేశం బదిలీ పై రాయపోల్ మండల కేంద్రం తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తహసిల్దార్ కృష్ణమోహన్ కార్యాలయం సిబ్బందితో కలిసి స్వాగతం పలుకుతూ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తహసిల్దార్ కార్యాలయంలో పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బంది లేకపోవడంతో విధులు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పని భారం అధికమవుతుందన్నారు. మండలానికి డిప్యూటీ తహసిల్దార్ పోస్ట్ రావడం సంతోషకరమని రైతులకు విద్యార్థులకు తహసిల్దార్ కార్యాలయం నుంచి అందించే సేవలను మరింత మెరుగుగా అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ నాగరాజు గౌడ్, జిపిఓ లు కరుణాకర్, కనకయ్య, నగేష్, హుమేరా, ఆపరేటర్లు అంబదాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.
తహసిల్దార్, డిప్యూటీ తహసిల్దార్ల బదిలీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES