Saturday, November 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మరింత కఠినతరం

రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మరింత కఠినతరం

- Advertisement -

నిరంతరం తనిఖీలు చేయాలని సూచన
ఉన్నత స్థాయి సమీక్షలో పొన్నం ఆదేశాలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి కొద్ది రోజులుగా రవాణా శాఖ అమలు చేస్తున్న సంస్కరణలు మరింత కఠినతరం చేయాలని రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. రవాణా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి మరణాల రేటును నివారించే విధంగా అధికారులు పని చేయాలని మంత్రి సూచించారు. ఇందుకోసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను వేగవంతం చేయడానికి ఇటీవల రవాణా శాఖలో 33 జిల్లా స్థాయి బందాలు, మూడు రాష్ట్రస్థాయి ప్లయింగ్‌ స్క్వాడ్‌ బందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇందులో డీటీసీ, ఆర్టీఏ ఇతర అధికారులు నిరంతరం తనిఖీలు చేపడుతున్నారని వివరించారు. ఏ బందం ఎక్కడ తనిఖీలు చేపడుతున్నదనే విషయమై ముందస్తు సమాచారం లేకుండా ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు ఆయా బందాలకు సమాచారం అందించి తనిఖీలు చేపట్టినట్టు చెప్పారు. గత 10 రోజుల వ్యవధిలో తనిఖీలు చేపట్టడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 4748 కేసులు నమోదు చేశామని ప్రకటిం చారు. మొత్తం 3420 వాహనాలు సీజ్‌ చేసినట్టు తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బందాలు తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. ముఖ్యంగా ఓవర్‌లోడ్‌ వల్లే రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో దాని మీద ఎక్కువగా దష్టి సారించినట్టు చెప్పారు. గత సంవత్సరం నిర్వహించిన రోడ్డు భద్రతా మాసోత్సవం మంచి ఫలితాలు ఇచ్చిందని చెప్పారు. ఈ సారీ జనవరిలో జరిగే రోడ్డు భద్రతా మాసోత్సవాలపై ఇప్పటినుంచే కార్యాచరణ రూపొందిం చాలని అధికారులను ఆదేశించారు. ఇందులో విద్యార్థులు, డ్రైవర్లు, కార్మికులు, పోలీసులు, అధికారులు భాగస్వామ్యం ఉండేలా ఇప్పటి నుంచి అవగాహన కల్పించాలని వివరించారు. పాఠశాల నుచి కాలేజీ వరకు వ్యాసరచన పోటీలు, రోడ్డు నిబంధనలపై నాటకాలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయా లన్నారు. ప్రతి పది రోజులకు ఒకసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ వికాస్‌రాజ్‌, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి , రవాణా శాఖ కమిషనర్‌ ఇలంబర్తి , జాయింట్‌ ట్రాన్స్పోర్ట్‌ కమిషనర్లు రమేష్‌, చంద్రశేఖర్‌ గౌడ్‌, శివలింగయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -