టీ20 జట్టును వీడిన డ్యాషింగ్ ఓపెనర్
హోబర్ట్ : ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. కంగారూ కీలక క్రికెటర్లు అందరూ రెడ్‌బాల్ ఫార్మాట్‌లో మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. భారత్‌తో రెండో టీ20 తర్వాత జోశ్ హేజిల్‌వుడ్ జట్టును వీడగా.. తాజాగా మూడో టీ20 తర్వాత డ్యాషింగ్ ఓపెనర్ ట్రావిశ్ హెడ్ సైతం దూరమయ్యాడు. ఇంగ్లాండ్‌తో యాషెస్‌తో సిరీస్‌లో ట్రావిశ్ హెడ్ లోయర్ మిడిల్ ఆర్డర్‌లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల వైట్‌బాల్ ఫార్మాట్‌లోనూ ట్రావిశ్ హెడ్ అంతగా రాణించటం లేదు. దీంతో తొలి టెస్టు ముంగిట దేశవాళీ షెఫల్డ్ ఫీల్డ్ టోర్నమెంట్‌లో ఆడేందుకు మొగ్గు చూపాడు. జులైలో వెస్టిండీస్ పర్యటన తర్వాత ట్రావిశ్ హెడ్ రెడ్‌బాల్ మ్యాచ్‌లో ఆడలేదు. దీంతో తాజాగా ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున హెడ్ ఆడనున్నాడు. జోశ్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, నాథన్ లయాన్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్‌లు సైతం దేశవాళీ రెడ్‌బాల్ టోర్నమెంట్‌లో ఈ వారం ఆడనున్నారు. భారత్, ఆస్ట్రేలియా నాల్గో టీ20 గోల్డ్‌కోస్ట్‌లో గురువారం జరుగనుంది.
ట్రావిశ్ హెడ్ యాషెస్ సన్నద్ధత
- Advertisement -
- Advertisement -



