Monday, April 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలూరు నుంచి కొండగట్టుకు పాదయాత్ర 

ఆలూరు నుంచి కొండగట్టుకు పాదయాత్ర 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూరు మండల కేంద్రం నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం కోసం ఆలూరు వాగడ జంబి హనుమాన్‌కు చెందిన 31 మంది స్వాములు 105 కిలోమీటర్లు పాదయాత్రగా బయలుదేరి విజయవంతంగా కొండగట్టుకు చేరుకున్నారు. భక్తి శ్రద్ధలతో స్వామివారి నామస్మరణ చేస్తూ పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ.. “ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఆలూరు నుంచి కొండగట్టుకు పాదయాత్ర విజయవంతంగా పూర్తిచేశామని, ప్రతి సంవత్సరం ఇదే విధంగా భక్తి భావంతో పాదయాత్ర కొనసాగిస్తాము అని అన్నారు. స్వామివారి కృపతో అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాము” అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -