- Advertisement -
బహుమతులు అందజేసిన సర్పంచ్ కొండ రాజమ్మ
నవతెలంగాణ – మల్హర్ రావు:
సంక్రాంతి పండగ పురస్కరించుకుని ముందస్తుగా మండలంలోని కొయ్యూరు విశ్వదీప్తి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ ముఖ్యదితిగా హాజరై బహుమతులు ప్రదానం చేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సుదర్శన్, వైస్ ప్రిన్సిపాల్,మాజీ కో ఆప్షన్ ఆయుబ్ ఖాన్,కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి వేల్పుల.వెంకటేష్ పాల్గొన్నారు
- Advertisement -



