- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఏళ్ళతరబడి పరిష్కారం నోచుకోని రామన్నగూడెం గిరిజనుల భూ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. రామన్నగూడెం సర్వే నెంబర్ 30, 36,39 లలో ఉన్న భూ సమస్య ను పరిష్కారం కోసం సోమవారం రెవిన్యూ – అటవీ శాఖలు జాయింట్ సర్వే ను ప్రారంభించారు. ఇందులో తహసీల్దార్ సీహెచ్వీ రామకృష్ణ, సర్వేలు నాగరాజు,ఆర్ఐ కృష్ణ,అటవీ శాఖ అశ్వారావుపేట రేంజర్ మురళి,అటవీ అభివృద్ధి సంస్థ కొత్తగూడెం, సత్తుపల్లి డీఎం లు చంద్రమోహన్,గణేష్, రేజర్ చంద్రకళ, డిప్యూటీ రేంజర్ రవి కుమార్ తో పాటు ఇరు శాఖల క్షేత్రస్థాయి సిబ్బంది,గ్రామస్తులు మడకం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -