నవతెలంగాణ – ఆర్మూర్
మునిసిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి ఆదర్శనగర్ లో 25 వ వార్డు కౌన్సిలర్ కు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని గుపాల భూపేందర్ ను ఆదర్శనగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా భూపేందర్ మాట్లాడుతూ… స్థానిక కాలనీ వాసిగా కాలనీలో నెలకొన్న అన్ని సమస్యలు తనకు తెలుసునని, రాబోయే కాలంలో కాలనీ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డిష్ ప్రకాష్, ఉపాధ్యక్షులు గోపి, కార్యదర్శి అరుణ్, కోశాధికారి బాలరాజ్, ప్రధానోపాధ్యాయులు సిరిల్ రావు, సౌడ రవి, శ్రావణ్, నాగరాజ్, గంగ నరసయ్య, శ్యామ్, కాలనీ సభ్యులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు. ఏడవ వార్డు నుండి గెలుపొందిన ప్రశాంత్ ను సైతం సన్మానించినారు. ఈ కార్యక్రమంలో జక్రాన్ పల్లి నాలుగో వార్డ్ సభ్యులు అవుసలి గోదావరి అరుణ్ కుమార్ , కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
నూతన కౌన్సిలర్ కు సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



