నవతెలంగాణ – ఆర్మూర్
తెలంగాణలోని బీడీకార్మికుల కుటుంబాల్లో ఆర్థికంగా వెలుగులు నింపిన దేశాయ్ బ్రదర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నితిన్ భాయ్ దేశాయ్ సంతాప సభను సంస్థ ఉద్యోగులు, టేకేదారులు పట్టణ కేంద్రంలో అంగడి బజార్ దేశాయ్ ఆఫీస్ లో శుక్రవారం నిర్వహించారు. ఈనెల 8న అనారోగ్యంతో మృతి చెందిన నితిన్ భాయ్ దేశాయ్ కు నివాళులు అర్పించారు. డీబీఎల్ వ్యాపార సామ్రాజ్యాన్ని ఓ పక్క విస్తరిస్తూ నే.. మరో పక్క నిరుపేదల ఆర్థిక ఎదుగుదలకు నితిన్ భాయ్ విశేషంగా కృషి చేశారని కొనియాడారు.
కార్మికులందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆయన జ్ఞాపకార్థం అందరికీ భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేశాయి బ్రదర్స్ బీడీ కంపెనీ డివిజన్ డీఎం విపుల్ భాయ్, ఏడీఎం అనిల్ భాయ్, రేంజ్ మేనేజర్ భరత్ భాయ్, తెలంగాణ టేకేదార్ గౌరవ అధ్యక్షులు లోక భూపతి రెడ్డి, టేకేదర్ మాజీ యూనియన్ సెక్రెటరీ బెనికి నారాయణ, శివాజీ, సంజయ్ బాయ్, తపన్, పృథ్వి, మంతన్ , టేకేదార్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



