Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సావిత్రిబాయి పూలే విగ్రహానికి నివాళులు 

సావిత్రిబాయి పూలే విగ్రహానికి నివాళులు 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్ ల గల సావిత్రిబాయి పూలే ఒక 195వ జయంతి సందర్భంగాతెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మన బడుగు బలహీన వర్గాలైన అమ్మాయిలు, స్త్రీలకు విద్య నేర్పించడం కోసం కష్టపడిన ఒడిదోడుకులను తట్టుకొని నిలబడిన తీరును గుర్తు చేశారు. వారి ఆశయాల సాధన కోసం నిరంతరం పాటు పడతామని తెలంగాణ బీసీ మహాసభ నిజాంబాద్ జిల్లా కన్వీనర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదే ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, గంగస్థాన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బెల్లీడిగే సత్యనారాయణ, ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయ్ దారం భూమన్న, పెద్ద ఎత్తున బీసీ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -