నవతెలంగాణ- తొగుట
ఎండు తెగులు నివారణకు ట్రైకోడెర్మా విరిడి ఉప యోగించాలని ఏఈవో నాగార్జున సూచించారు. శనివారం మండలంలోని పెద్ద మాసాన్ పల్లి గ్రామం ఎండు తెగులు నివారణకు ట్రైకోడెర్మా విరిడి, పశువుల ఎరువులో వృద్ధి చేసే విధానం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ వానాకాలం మొక్కజొన్న పంటకు ఎండు తెగులు ఆశించిందని అన్నారు. రైతులు యాసంగి అదే భూమిలో పంట మార్పిడి లేకుండా మళ్లీ మొక్కజొన్న లేదా బీన్స్ వంటి పంటలు సాగు చేసినట్లయితే మళ్లీ ఎండు తెగులు సోకే అవకాశం ఉంటుందని అన్నారు. కావున రైతులు తగు జాగ్ర త్తలు పాటించినట్లయితే ఈ యాసంగి అధిక దిగు బడులు పొందవచ్చని తెలిపారు. ఎండు తెగుళ్లు నివారణ కొరకు విత్తనం విత్తేముందు ట్రైకోడెర్మా విరిడి తో నేల మరియు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు.
ట్రైకోడెర్మా విరిడి అనేది బూజు జాతికి చెందిన శిలీంద్ర నాశిని అని చెప్పారు. ఇది పంటలకు హాని కలిగించే శిలీం ద్రాలను ఆశించి, నిర్మూలిస్తుందని, వివిధ పంటల్లో శిలీంధ్రపు తెగుళ్లైన ఎండు తెగులు, వేరుకుళ్లు తెగుళ్లను సమర్ధవంతంగా అరికట్టటానికి ట్రైకో డెర్మా విరిడి జీవ శిలీంధ్రం ఎంతో ఉపయోగపడు తుందని అన్నారు. విత్తన శుద్ధి ఒక్క కిలో విత్త నానికి ట్రైకోడెర్మా విరిడి పొడి 10 గ్రాములు, ద్రవ రూపంలో అయితే 10 ఎంఎల్ విత్తనానికి పట్టించి 20 నిమిషాలు ఆరబెట్టిన తర్వాత వితుక్కోవాలని కోరారు. రైతు స్థాయిలో ట్రైకోడెర్మా విరిడిని పశు వుల ఎరువులో వృద్ధి చేసే విధానం 90కిలోల బాగా చివికిన పశువుల ఎరువును తీసుకుని దీని కి 10కిలోల వేపపిండిని కలిపాలని చెప్పారు. దీన్ని నీడవున్న ఎత్తైన ప్రదేశంలో చదరంగా గుట్టగా పోయాలని అన్నారు.
దీనిపై 1 నుండి 2 కిలోల పొడి లేదా ఒక లీటర్ ద్రవ రూపంలో ట్రైకోడెర్మా విడిని పొరలు పొరలుగా చల్లాలి. దీనిపై 1కి. బెల్లా న్ని కలిపిన నీటిని, పశువుల ఎరువుపై చల్లాలని, బెడ్ తేమగా వుండే విధంగా నీరు చిలకరించాలని సూచించారు. తేమ ఆవిరికాకుండా దీనిపై గోనె పట్టాలు కప్పి వుంచాలని, రోజూ నీరు చిలకరి స్తుంటే 7-10 రోజుల్లో ట్రైకోడెర్మా శిలీంద్రం ఎరువు మొత్తం వ్యాపిస్తుందని తెలిపారు. గొనెపట్టాను పైకి తీసినప్పుడు పశువుల ఎరువుపై తెల్లటి బూజు ఆక్రమించి వుండటం గమనించి, ఈ సమయంలో దీన్ని పొలంలో తేమ ఉన్నప్పుడు సమానంగా వెదజల్లాలని చెప్పారు. దీనివల్ల మొక్కల వేర్ల చుట్టూ, ట్రైకోడెర్మా శిలీంద్రం అభివృద్ధి చెంది, వేరుకుళ్లు తెగులు నుంచి పంటను రక్షిస్తుందని అన్నారు. దీన్ని రసాయన ఎరువులు, పురుగు మందులతో కలిపి వాడకూడదన్నారు. ఒకవేళ వాడాల్సి వస్తే కనీసం 15 రోజుల వ్యవధి ఇవ్వాల ని తెలిపారు. జీవన ఎరువులు, సేంద్రియ ఎరువు లతో కలిపి వాడవచ్చని తెలిపారు.
ఎండు తెగులు నివారణకు ట్రైకోడెర్మా విరిడి: ఏఈవో నాగార్జున
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



