నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
నిబంధనలకు విరుద్ధంగా త్రిబుల్‌ఆర్ అలైన్‌మెంట్‌ను రూపొందించిన రాష్ట్రప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బాధిత రైతులు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో నామినేషన్ వేసి నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే త్రిబుల్‌ఆర్ బాధిత రైతులు 40 మంది వరకు నామినేషన్ దాఖలు చేసినట్టు తెలిసింది. తాజాగా నారాయణపురం మండలంలో సర్వేలు, పుట్టపాక గ్రామానికి చెందిన మరో ఆరుగురు రైతులు ఈనెల 21 ఆఖరి రోజున నామినేషన్‌లు దాఖలు చేసి నిరసన తెలియజేస్తామని తెలిపారు. ఎర్రగుంట గ్రామానికి చెందిన గుండె మల్లేష్, వర్ధన్ నాగార్జున పుట్టపాక గ్రామానికి చెందిన నెల్లికంటి నాగరాజు, గాజుల అంజయ్య, నక్క రమేష్, సుక్క యాదయ్య ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి నామినేషన్ పత్రాలను తీసుకున్నారు. 2022లో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలనను నిరసిస్తూ మునుగోడు ఉపఎన్నికల్లో సైతం 60 మంది నామినేషన్లు వేసి 12 మంది బరిలో నిలిచారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ బాధితులు తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలిపేందుకు నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల్లో 200 మందికి పైగా నామినేషన్లు వేసి నిరసన తెలిపిన విషయం విధితమే. అదే తరహాలో జూబ్లీహిల్స్ ఉపఎన్ని కల్లోనూ బాధిత రైతులు తమ ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని నిరసిస్తూ నామినేషన్లతో నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు.
నామినేషన్లతో త్రిబుల్‌ఆర్ బాధితుల నిరసన !
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES