Thursday, November 27, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవెనిజులా చమురుపై ట్రంప్‌ కన్ను

వెనిజులా చమురుపై ట్రంప్‌ కన్ను

- Advertisement -

హూస్టన్‌ : వెనిజులాలోని అపార చమురు నిక్షేపాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కన్నేశారు. వెనిజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురోను ఎలాగైనా దారికి తెచ్చుకొని ఆ నిక్షేపాలను సొంతం చేసుకోవాలని ఆయన ఎత్తుగడ పన్నారు. వెనిజులా ప్రస్తుతం తన ముడి చమురులో ఎక్కువ భాగాన్ని చైనాకు విక్రయిస్తోంది. మదురోతో చర్చలు జరుపుతానని చెబుతున్న ట్రంప్‌, ఆ సందర్భంగా చమురు కొనుగోలు వ్యవహారాన్ని ముందుకు తెస్తారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కరేబియన్‌ ప్రాంతంలో ఓ వైపు సైనిక దళాలను మోహరిస్తూనే మరోవైపు మదురోతో చర్చలకు సిద్ధమేనని అమెరికా చెబుతోంది. దేశంలోని చమురు క్షేత్రాలలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు వెనిజులా చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. అమెరికా ఇప్పటికే విధించిన ఆంక్షలే దీనికి కారణం.

ఒపెక్‌ సభ్యదేశమైన వెనిజులా చమురు ఉత్పత్తి ఈ ఏడాది రోజుకు సగటున 1.1 మిలియన్‌ బ్యారల్స్‌ వద్ద స్థిరంగా ఉంది.జూన్‌-అక్టోబర్‌ మధ్యకాలంలో ఇందులో 80 శాతానికి పైగా ఎగుమతులు చైనాకే వెళ్లాయి. అపారమైన ముడి చమురు నిల్వలు ఉన్నందునే అమెరికా తమను లక్ష్యంగా చేసుకున్నదని వెనిజులా చమురు శాఖ మంత్రి డెల్సీ రోడ్రిగుజ్‌ చెప్పారు. ఎలాంటి ధర చెల్లించకుండా వెనిజులా చమురు, సహజ వాయువు నిల్వలను సొంతం చేసుకోవాలని అమెరికా భావిస్తోందని ఆమె విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -