Wednesday, December 17, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంబీబీసీపై ట్రంప్‌ పరువునష్టం దావా

బీబీసీపై ట్రంప్‌ పరువునష్టం దావా

- Advertisement -

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం బీబీసీపై పది బిలియన్‌ డాలర్ల పరువునష్టం దావా వేశారు. 2021 జనవరి 6వ తేదీన మద్దతుదారులను ఉద్దేశించి తాను చేసిన ప్రసంగాన్ని వక్రీక రించి తప్పుదోవపట్టించేలా ఎడిట్‌ చేశారని ఆయన ఆరోపించారు. అమెరికా ప్రభుత్వ భవనంలోకి ట్రంప్‌ మద్దతుదారులు చొచ్చుకుపోవడానికి ముందు ఆయన ఈ ప్రసంగం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ విజయాన్ని ధృవీకరించవద్దంటూ ప్రతినిధిసభపై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్‌ మద్దతుదారులు అక్కడ ఆందోళన చేసిన విషయం తెలిసిందే. మియామీలోని ఫెడరల్‌ కోర్టులో ట్రంప్‌ ఈ దావా వేశారని రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది.

ఎడిట్‌ చేసిన క్లిప్పింగులను బీబీసీ ప్రసారం చేసిందని, గలాభా సృష్టించాల్సిందిగా మద్దతుదారులను రెచ్చగొట్టానని అర్థం వచ్చేలా ఆ క్లిప్పింగులను ఎడిట్‌ చేశారని ట్రంప్‌ ఆరోపించారు. తన ప్రసంగంలోని వేర్వేరు భాగాలను కలిపేసి క్లిప్పింగును రూపొందించారని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయం వైపు కదలాలని మద్దతుదారులకు చెప్పానని, తీవ్రంగా పోరాడాలని మరోసారి చెప్పానని, తన ప్రసంగంలోని ఈ రెండు భాగాలను కలిపి చూపించి ప్రజలను తప్పుదారి పట్టించారని ధ్వజమెత్తారు. కాగా జరిగిన పొరబాటుకు బీబీసీ గతంలోనే క్షమాపణ చెప్పింది. ఓ నిర్ణయానికి రావడంలో తప్పు జరిగిందని అంగీకరించింది. అయితే పరువునష్టం కలిగించామని చెప్పడానికి ఎలాంటి ప్రాతిపదిక లేదని స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -