Monday, April 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్టిజెన్‌ కార్మికుల సమ్మెకు టీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ మద్దతు

ఆర్టిజెన్‌ కార్మికుల సమ్మెకు టీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ మద్దతు

- Advertisement -

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
విద్యుత్‌ ఆర్టిజెన్‌ కార్మికుల సమ్మెకు టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం వారి సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేసింది. సమ్మె ప్రాంతాలకు వెళ్లి ప్రత్యక్షంగా మద్దతు తెలిపాలని నాయకులు, కార్యకర్తలను కోరింది. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర కమిటీ సమావేశంలో తీర్మానించింది. సామాజిక సంఘీభావ వారోత్సవాలలో భాగంగా ఆయా డిపోల్లో కార్మికుల నుంచి బుధవారం సంఘీభావం నిధి వసూలు చేయాలని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావు పిలుపునిచ్చారు.

ఆర్టీసీలో విద్యుత్‌ బస్సుల సంఖ్య పెరిగి నందున, డ్రైవర్‌, మెకానిక్‌లు అదనంగా ఉన్నారనీ, వారిని డిప్యూటేషన్‌పై పంపుతామనీ, రీ కాటగిరి చేస్తామంటూ కార్మికులను వేధించడం సరైందికాదని చెప్పారు. వివిధ రకాల కార్మికులు వారు రిక్రూట్మెంట్‌ అయిన రీజియన్లలోనే ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. వారి బదిలీ చేయొద్దని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ బస్‌లను సమాకూర్చుకుని, నడిపేలాగ రాష్ట్ర ప్రభుత్వం ఆ బస్సుల విధానంలో మార్పులు చేయాలని కోరారు. కార్మికుల ఉద్యోగానికి భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. వీటన్నింటిపై ఈనెల 7న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం సమర్పించినట్టు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -