నవతెలంగాణ – భూపాలపల్లి
నూతన సంవత్సరం 2026ను పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లా ఎస్పీని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్, అదేవిధంగా భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో డిఎస్పి సంపత్ రావు,సిఐ నరేష్ కుమార్, ఎస్సై సాంబమూర్తి లను వేరు వేరుగా కలిసి పూల బొకే అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఎర్రం సతీష్ కుమార్, కార్యదర్శి గుజ్జ సారేశ్వరరావు, కోశాధికారి మండల రాంబాబు, బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ప్రవీణ్ కుమార్, కోశాధికారి ఏనుగుల భాస్కర్,మీడియా జిల్లా కన్వీనర్ పుల్ల సృజన్,జిల్లా కమిటీ సభ్యులు మంద జోవర్ధన్ తదితరులు ఉన్నారు.




