– స్కూటీ డిక్కీలో 4 గంజాయి పాకెట్స్ స్వాధీనం
– భీంగల్ సిఐ సత్యనారాయణ గౌడ్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి నాలుగు గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు భీంగల్ సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.నమ్మదగిన సమాచారం మేరకు ఒక స్కూటీ మీద జగిత్యాల జిల్లా మెట్ పల్లి నుండి కమ్మర్ పల్లికి గంజాయి అమ్మడానికి ఇద్దరు వ్యక్తులు వస్తున్నారని సమాచారం అందిందన్నారు. వెంటనే కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి గ్రామ శివారులోని రైస్ మిల్ వద్ద తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారన్నారు. వాహన తనిఖీల్లో భాగంగా ఒక స్కూటీ డిక్కీలో 4 గంజాయి పాకెట్స్ సుమారు 20గ్రాములు లభించాయన్నారు.
వారిని పట్టుకుని విచారించగా స్కూటీ నడిపుతున్న వ్యక్తి జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన నాంపెల్లి వికాస్(ఏ1), కమ్మర్ పల్లికి చెందిన షేక్ ఇమ్రాన్(ఏ2) తో కలిసి గంజాయినీ కమ్మర్ పల్లికి చెందిన వ్యక్తులకు అమ్మడానికి తీసుకు వస్తున్నట్లు చెప్పారన్నారు. ఇంతకు ముందు కూడా షేక్ ఇమ్రాన్, వికాస్ దగ్గర గంజాయి కోని కమ్మర్ పల్లిలో అమ్మినట్లు విచారణలో తెలిపారు అన్నారు.వీరిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకొని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ సమావేశంలో కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి, మోర్తాడ్ ఎస్ఐ రాము, హెడ్ కానిస్టేబుల్ అప్సర్, కానిస్టేబుల్స్ నవీన్, లక్ష్మణ్, రాజు, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES