- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల కేంద్రంలో పోలీసులు నిర్వహించిన తనిఖీలలో మద్యం తాగుతూ పట్టుబడిన ఇద్దరికి కల్వకుర్తి జడ్జి కావ్య జడ జైలు శిక్షతోపాటు జరిమానా విధించినట్టు వెల్దండ ఎస్సై కురుమూర్తి శుక్రవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి పట్టణానికి చెందిన ఖాజ మైనొద్దీన్ ఖాన్ కు 2 రోజుల జైలు శిక్షతోపాటు రూ .100  జరిమానా విధించినట్లు తెలిపారు. అలాగే  మండల పరిధిలోని రాచూరు గ్రామానికి చెందిన కాటిక యాదయ్యకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరోజు జైలు శిక్షతోపాటు రూ. 600 జరిమానా విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
- Advertisement -

 
                                    