మరికొందరికి గాయాలు
నవతెలంగాణ – రాయికల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్కాపురం జిల్లా రాయవరం వద్ద గురువారం జరిగిన ఘోర బస్సు ప్రమాదం జగిత్యాల జిల్లా రాయికల్, కోరుట్ల ప్రాంతాల్లో విషాదాన్ని నింపింది. జగిత్యాల జిల్లా నుంచి కూడా ఈ బస్సులో ప్రయాణికులు వెళ్లారు. కోరుట్ల నుంచి ఆరుగురు, జగిత్యాల నుంచి ఇద్దరు ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్టు తెలిసింది. వారి పరిస్థితిపై కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రాయికల్ మండలంలోని రామారావుపల్లె గ్రామంలో స్థిరపడిన ఉప్పు రమాదేవి, రాయికల్ పట్టణంలో పనిచేస్తున్న వెంకటేష్ మంటల్లో కాలిపోయి సజీవ దహనమైనట్టు సమాచారం. రత్నమ్మ, కిరణ్ తీవ్రంగా గాయపడగా, మరికొందరు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది.
మార్కాపురం బస్సు ప్రమాదంలో..ఇద్దరు రాయికల్ వలస కార్మికులు మృతి!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



