ఎస్సై కనుకుల క్రాంతి కిరణ్
నవతెలంగాణ – పెద్దవంగర : వివాహిత మృతికి బాధ్యులైన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై కనుకుల క్రాంతి కిరణ్ తెలిపారు. అవుతాపురం ఘటన కేసు వివరాలను సోమవారం ఎస్సై వెల్లడించారు. గ్రామానికి చెందిన ఓ వివాహిత ఈనెల 3న ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు అవుతాపురం గ్రామానికి చెందిన సలిదండి ప్రవీణ్, తొర్రూరు పట్టణానికి చెందిన చిదిరాల రాజు నిందితులను కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి వారికి 12 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను మహబూబాబాద్ సబ్ జైల్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
అవుతాపురం ఘటనలో ఇద్దరికి రిమాండ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES